AP High Court : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
ఏపీలో సోషల్ మీడియా(AP social media) కార్యకర్తల నిర్బంధాలపై హైకోర్టు(High court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో సోషల్ మీడియా(AP social media) కార్యకర్తల నిర్బంధాలపై హైకోర్టు(High court) ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీకి చెందిన పలువురు సోషల్ మీడియా కార్యకర్తల(YCP Leaders) కుటుంబ సభ్యులు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ నెల 4 నుంచి ఈరోజు వరకు పోలీస్ స్టేషన్లలోని సీసీ ఫుటేజ్(CCTV Footage) స్థానిక మెజిస్ట్రేట్‌లకు సమర్పించాలని ఆదేశించింది. పౌరుల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఈ కోర్టుకు ఉందని వ్యాఖ్యానించింది. చట్టానికి లోబడి వ్యవహరించకపోతే ఏం చేయాలో చెప్తామని హైకోర్టు సీరియసైంది. ఒకేసారి ఇన్ని పిటిషన్లు రావడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని సమాచారం. ఏపీలో అసలు ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇవన్నీ తప్పుడు పిటిషన్‌లని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. బాధిత కుటుంబ సభ్యులే వేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అదుపులోకి తీసుకున్న వారందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు న్యాయమూర్తుల దృష్టికి తీసుకొని వచ్చారు. మీ మాటలు ఎలా నమ్మాలని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆ ఆరుగురు వ్యక్తులు ఎక్కడ ఉన్నారో వెంటనే చెప్పాలని ఆదేశించింది. ఈనెల 4 నుంచి పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు సోమవారానికి వాయిదా వేసింది.