Chandrababu Bail : చంద్రబాబు బెయిల్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై వాదనలు ముగిశాయి. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటీషన్ పై విచారణ ముగిసింది.

AP High Court reserves verdict on Naidu’s regular bail plea in skill development case
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రెగ్యులర్ బెయిల్ పిటీష(Regular Bail Petition) పై వాదనలు ముగిశాయి. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్(Reserve) చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసు(Skill Scam)లో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటీషన్ పై విచారణ ముగిసింది.
చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి(Chandrababu Health Condition)పై ఆయన తరుపున న్యాయవాదులు హెల్త్ రిపోర్టు(Health Report) కూడా ఇచ్చారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని.. ఆయనకు గుండెపోటు వచ్చే అవకాశముందని.. రక్తప్రసరణ కూడా తక్కువగా ఉందని ఆ హెల్త్ రిపోర్టులో పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ లో కోరారు. మరో వైపు సీఐడీ(CID) కూడా నిధుల దుర్వినియోగం జరిగిందని.. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించింది. దీనికి సంబంధించి టీడీపీ పార్టీ అకౌంట్ లోకి 27 కోట్ల రూపాయలు మళ్లించిన వైనాన్ని కూడా వివరించారు. ఇంకా ఈ కేసులో మరికొందరిని విచారించాల్సి ఉందని, చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు కోరారు. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలో చంద్రబాబు షరతులును ఉల్లంఘించారని.. తెలంగాణ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని సీఐడీ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది..
