స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు(Skill Development Scam Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(AP High Court)లో సోమ‌వారం మధ్యాహ్నం వాదనలు ముగిశాయి. భోజన విరామం అనంతరం హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు(Skill Development Scam Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(AP High Court)లో సోమ‌వారం మధ్యాహ్నం వాదనలు ముగిశాయి. భోజన విరామం అనంతరం హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అంతకుముందు చంద్రబాబు తరఫున న్యాయ‌వాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

స్కిల్ స్కామ్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆయ‌న‌ కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని.. ఆయన తరఫు న్యాయవాదులు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మ‌రోవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనల విష‌యంలోనూ మంగళవారం నిర్ణయం తీసుకుంటామని జడ్జి తెలిపారు.

Updated On 30 Oct 2023 6:51 AM GMT
Ehatv

Ehatv

Next Story