టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chnadrababu) ముందస్తు బెయిల్‌(Anticeptory Bail) పిటిషన్లను ఏపీ హైకోర్టు(AP High Court) డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన మూడు బెయిల్‌ పిటిషన్లను(Bail Petition) కోర్టు కొట్టిసింది.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chnadrababu) ముందస్తు బెయిల్‌(Anticipatory Bail) పిటిషన్లను ఏపీ హైకోర్టు(AP High Court) డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన మూడు బెయిల్‌ పిటిషన్లను(Bail Petition) కోర్టు కొట్టిసింది. అమరావతి రింగ్‌ రోడ్డు(Inner Ring Road Case), ఫైబర్‌నెట్‌(Fibernet Case), అంగళ్లు కేసుల్లో(Angullu case) చంద్రబాబు వేసిన బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌(Skill Development Case) కేసులో అరెస్టైన చంద్ర‌బాబు 30 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఫైబర్‌ నెట్‌ కేసులో A-24గా ఉన్న చంద్రబాబు.. ఇన్నర్‌ రింగు రోడ్డు కేసులో A-1గా.. అంగళ్లు కేసులో కూడా A1గా ఉన్నారు. హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సుప్రీంకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తుంది.

మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు కొట్టివేయడంతో.. ఆ కేసుల‌లో చంద్ర‌బాబును విచారించేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ తీర్పులతో టీడీపీ డీలా పడింది. ఇప్పటికే నెల రోజుల నుంచి జైలులో ఉన్న చంద్రబాబుకు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఈ తీర్పు షాక్ ఇచ్చింది. ఇదిలావుంటే.. ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణకు రానుంది.

Updated On 9 Oct 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story