Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో షాకిచ్చిన కోర్టు.. మరో రెండు కేసుల్లోనూ కోర్టును ఆశ్రయించిన లోకేష్..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో(Amaravati Inner Ring Road Scam) నిందితుడిగా ఉన్న టీడీపీ(TDP) యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్(Anticeptary Bail Petition) ను కొట్టివేసింది కోర్టు(Court).
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో(Amaravati Inner Ring Road Scam) నిందితుడిగా ఉన్న టీడీపీ(TDP) యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. ఏసీబీ కోర్టులో(ACB Court) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్(Anticeptary Bail Petition) ను కొట్టివేసింది కోర్టు(Court). సీఐడీ(CID) వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. విచారణకు సహకరించాలంటూ లోకేష్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ఢిల్లీలో ఉన్న ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో ఆయన హైకోర్టులో మరో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత.. లోకేష్ స్కిల్ స్కాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపి తీర్పు ప్రకటించే అవకాశముంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో సీఐడీ ఎఫ్ఐఆర్ లో లోకేష్ ఏ-14గా చేర్చింది.