Chandrababu : చంద్రబాబు బెయిల్ షరతులపై సీఐడీ పిటిషన్.. తీర్పు వాయిదా వేసిన కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టు(AP High Court) మధ్యంతర బెయిల్(interim bail) మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు బెయిల్ పై షరతులు విధించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఐడీ పిటీషన్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు తరపు లాయర్లు ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు.

చంద్రబాబు బెయిల్ పై ఆంక్షలు విధించాలని.. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా.. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయకుండా ఆదేశించాలని సీఐడీ కోర్టును కోరింది. కేవలం చికిత్స చేయించుకోవడానికి మాత్రమే ఆయనను పరిమితం చేయాలని విన్నవించింది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత ర్యాలీగా దాదాపు 14 గంటల పాటు ప్రయాణించి రాజమండ్రి నుంచి ఉండవల్లికి చేరుకున్నారు. విచారణ సందర్భంగా సీఐడీ లాయర్లు ర్యాలీకి సంబంధించిన వీడియోలను తీసుకొచ్చి న్యాయమూర్తులకు చూపించారు. చంద్రబాబు కోర్టు షరతుల్ని ఉల్లంఘించారని వాదించారు.
చంద్రబాబు ఎలాంటి షరతులు ఉల్లంఘించ లేదని, చంద్రబాబు మాట్లాడటం ఆయన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే తప్ప అతిక్రమణ కాదని ఆయన తరుపు లాయర్లు వాదించారు. గతంలో జైలుశిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే హక్కులు కోర్టులు కల్పించాయన్నారు. సీఐడీ సిటీషన్‌లో కోరుతున్న షరతులు చంద్రబాబు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 3న తీర్పును వెలువరిస్తామని తెలిపింది.