Ap High Court : ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టు (AP High Court ) నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. నూతన న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ హైకోర్టు ఛీప్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dheeraj Singh Thakur), హోం మంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. […]

Ap High Court
ఏపీ హైకోర్టు (AP High Court ) నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. నూతన న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ హైకోర్టు ఛీప్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Dheeraj Singh Thakur), హోం మంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌లు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం నేడు జరిగింది.
