AP High Court Trial On TTD Board Selection : నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమించడంపై హైకోర్టులో విచారణ
నేర చరిత్ర ఉన్న వ్యక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా(TTD Board Members) ఎన్నిక చేయటంపై హైకోర్టులో(High Court) నేడు విచారణ జరిగింది. బోర్డు మెంబర్లుగా ఎండోమెంట్ చట్టాలకు వ్యతిరేకంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి(Sharath chandra), డాక్టర్ కేతన్(Dr.Kethan), సామినేని ఉదయభానుల(Samineni Udhayabhanu) నియామకం చల్లదంటూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు(Venkateshwarulu) హైకోర్టులో పిటీషన్ వేశారు.
నేర చరిత్ర ఉన్న వ్యక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా(TTD Board Members) ఎన్నిక చేయటంపై హైకోర్టులో(High Court) నేడు విచారణ జరిగింది. బోర్డు మెంబర్లుగా ఎండోమెంట్ చట్టాలకు వ్యతిరేకంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి(Sharath chandra), డాక్టర్ కేతన్(Dr.Kethan), సామినేని ఉదయభానుల(Samineni Udhayabhanu) నియామకం చల్లదంటూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు(Venkateshwarulu) హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liqour Scam) లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఉదయభాను, డాక్టర్ కేతన్ పై తీవ్రమైన నేరారూపణలు ఉన్నాయని.. పరమ పవిత్ర తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నేరచరిత్ర వున్నవారు ఉండటం.. భక్తుల మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఉందని పిటిషనర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాత్కాలిక బెయిల్‌పై ఉన్న నిందితుడిని రాజకీయ ప్రయోజనాలతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా ఎన్నిక చేయటం చట్ట విరుద్ధమని పిటీషన్ లో పేర్కొన్నారు. పిటిషన్‌లో దేవదాయ శాఖ కమిషనర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆకుల శేష సాయి(Justice Akula Shesha Sai), జస్టిస్ రఘునందన్ రావులతో(Justice Raghunandan Rao) కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రతివాదులుగా ఉన్న దేవదాయ శాఖ కమిషనర్, తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ధర్మాసనం వివరణ కోరింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ధర్మాసనం.