ఎమ్మెల్సీ అనంత్ బాబు(MLC Ananth Babu) కేసులో ఏపీ హైకోర్టు(AP High Court) తీర్పు రిజర్వ్ చేసింది. మృతి చెందిన‌ డ్రైవర్ సుబ్రహ్మణ్యం(Driver Subramanyam) తల్లిదండ్రులు కేసును సీబీఐకి(CBI) అప్పగించాలని.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసుపై నేడు ఏపీ హైకోర్టులో వాడివేడిగా వాదనలు న‌డిచాయి. ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపున‌ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించగా.. హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

ఎమ్మెల్సీ అనంత్ బాబు(MLC Ananth Babu) కేసులో ఏపీ హైకోర్టు(AP High Court) తీర్పు రిజర్వ్ చేసింది. మృతి చెందిన‌ డ్రైవర్ సుబ్రహ్మణ్యం(Driver Subramanyam) తల్లిదండ్రులు కేసును సీబీఐకి(CBI) అప్పగించాలని.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసుపై నేడు ఏపీ హైకోర్టులో వాడివేడిగా వాదనలు న‌డిచాయి. ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపున‌ ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించగా.. హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను నిందితురాలిగా ఎందుకు చేర్చలేదని హైకోర్టు ప్ర‌శ్నించింది. సీసీ ఫుటేజ్ లో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదన్న కోర్టు.. కేవలం అనంత్ బాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్ర‌శ్నించింది.

కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని..కేసును నీరు గార్చే విధంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రావణ్ కోర్టులో వాదన‌లు వినిపించారు. ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపు సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఆయ‌న‌ వాదనలు వినేందుకు న్యాయస్థానం అంగీకరించ‌లేదు. ప్రభుత్వం కేసు వివరాలు ఇప్పటికే సీల్డ్ కవర్ లో న్యాయస్థానంకు సమర్పించింది.

Updated On 16 Aug 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story