Chandrababu Bail : స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
స్కిల్ స్కాం డెవలప్‌మెంట్(Skill Development Case) కేసులో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) భారీ ఊరట దక్కింది. హైకోర్టు(High Court) ఆయనకు రెగ్యులర్ బెయిల్(Regular Bail) మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పు వెలువరించింది. చంద్రబాబు ఇటీవల అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చారు.

Chandrababu Bail

స్కిల్ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు కంటి ఆపరేషన్ నిమిత్తం కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28 వరకూ మధ్యంతర బెయిల్ గడువు ఉండగా.. నేడు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.