వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే(YSRCP Rebel MLAs)లు ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy), ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrashekar Reddy)లకు ఏపీ అసెంబ్లీ స్పీకర్(AP Assembly Speaker) నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. మీపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదని స్పీకర్ నోటీసుల్లో ప్ర‌శ్నించారు. ఈ నోటీసులపై నలుగురు ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు.

సోమ‌వారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్(Lunch Motion Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. మండలి చైర్మన్ కూడా ఇదే తరహా అనర్హత వేటుపై ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య(C Rama Chandraiah)కు నోటీసులు పంపారు. ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు.

Updated On 29 Jan 2024 9:00 PM GMT
Yagnik

Yagnik

Next Story