ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు(AP Skill Development Scam Case)లో మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌(Chandrababu Remandను ఏసీబీ కోర్టు(ACB Court) మరోసారి పొడిగించింది. నేటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగుస్తుండడంతో.. మ‌రో 15 రోజుల పాటు రిమాండ్ గ‌డువు పొడిగించాలని సీఐడీ ఇవాళ మెమో దాఖలు చేసింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు(AP Skill Development Scam Case)లో మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌(Chandrababu Remand)ను ఏసీబీ కోర్టు(ACB Court) మరోసారి పొడిగించింది. నేటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగుస్తుండడంతో.. మ‌రో 15 రోజుల పాటు రిమాండ్ గ‌డువు పొడిగించాలని సీఐడీ ఇవాళ మెమో దాఖలు చేసింది. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపర్చారు. అనంతరం రిమాండ్ ను ఈ నెల 19 వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు.

సీఐడీ తరఫున హాజరైన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(AAG Ponnavolu Sudhakar Reddy).. చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే(Advocate Pramod Kumar Dubey) తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీకి తగిన కారణాలు ఉన్నాయని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. స్కిల్ స్కాంలో చేతులు మారిన రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయ‌ని ఆధారాలు కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో కస్టడీకి ఇస్తేనే మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయని పొన్నవోలు వాదించారు. రాజకీయ కారణాలతోనే మరోసారి కస్టడీ అడుగుతున్నారని ప్రమోద్ కుమార్ దూబే వాదించారు. కాగా.. చంద్ర‌బాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.

Updated On 5 Oct 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story