AP High Court Rejected Lunch Motion Petition : ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు
ఏపీ హైకోర్టులో(AP High Court) మరోమారు చంద్రబాబుకు(Chandrababu) చుక్కెదురైంది. చంద్రబాబు బెయిల్‌పై వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌ను(Lunch Motion Petition) హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది.
ఏపీ హైకోర్టులో(AP High Court) మరోమారు చంద్రబాబుకు(Chandrababu) చుక్కెదురైంది. చంద్రబాబు బెయిల్‌పై వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌ను(Lunch Motion Petition) హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. స్కిల్ కేసులో(Skill Development Case) చంద్రబాబు బెయిల్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. దీనిని హైకోర్టు నిరాకరించింది.
ఇదిలావుంటే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో(Supreme Court) మంగళవారం విచారణ ప్రారంభమయింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే(Harish Salve), సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ(Mukul Rohathgi) వాదనలు వినిపిస్తున్నారు. సోమవారం కూడా హోరాహోరీగా వాదనలు జరుగగా.. సమయం మించిపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం విచారణ జరుగుతుంది.