AP High Court: వారికి గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు.. నిధులు పడబోతున్నాయా?
నాలుగున్నర ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని కొత్త పథకం కాదని
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీబీటీ నిధుల పైన కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల తరువాత నిధుల విడుదల చేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాల పైన హైకోర్టు ఒక్క రోజు స్టే విధించింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిధుల విడుదల చేయవద్దని.. కేవలం ఈ ఒక్క రోజులోనే నగదు విడుదలకు అనుమతి ఇచ్చింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందిస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.
నాలుగున్నర ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని కొత్త పథకం కాదని వైసీపీ వివరణ ఇచ్చింది. కొందరు విద్యార్థులు, మహిళలు, లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు గత నాలుగున్నరేళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది. డిబిటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు అబయాన్స్లో పెట్టింది హై కోర్టు. ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం గానీ, బదలాయించడం గానీ చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్‌నెట్‌తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా కూడా ప్రచారం చేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.