Chandrababu Bail Conditions : చంద్రబాబుకు బెయిల్.. కండీషన్స్ ఇవే..!
స్కిల్ కేసులో(Skill development Case) చంద్రబాబుకు(Chandrababu) మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసి న్యాయస్థానం..

Chandrababu Bail Conditions
స్కిల్ కేసులో(Skill development Case) చంద్రబాబుకు(Chandrababu) మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసి న్యాయస్థానం.. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ మంజూరు నేపథ్యంలో.. కోర్టు రూ.లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని ఆయన తరుపు న్యాయవాదులకు సూచించింది.
షరతులు..
ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కోర్టు చంద్రబాబు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి.. ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని పేర్కొంది.
చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీ అధికారుల ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్ధనపై న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఇక జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలోనూ కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని.. చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్యానించారు. అలాగే నవంబర్ 10న చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌పై వాదనలు విననున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
బెయిల్ మంజూరైన నేపథ్యంలో రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నేరుగా తిరుపతికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య ఆయన జైలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
