స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబుకు(Chandrababu) కోర్టు మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు అయ్యింది. చంద్ర‌బాబు ఆరోగ్య సమస్య లు దృష్ట్యా న్యాయస్థానం ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబుకు(Chandrababu) కోర్టు మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు అయ్యింది. చంద్ర‌బాబు ఆరోగ్య సమస్య లు దృష్ట్యా న్యాయస్థానం ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన‌ న్యాయస్థానం.. ప‌లు ష‌ర‌తులు విధించింది. చంద్రబాబు 53 రోజులుగా రాజమండ్రి కేంద్ర ఖారాగారంలో జ్యూడిషల్ రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ మంజూర‌వ‌డంతో తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

చంద్రబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంపై మంత్రి అంబ‌టి రాంబాబు(Amabti Rambabu) స్పందించారు. ట్విట‌ర్‌లో(Twitter) ఆయ‌న.. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్.! అంటూ త‌న‌దైన స్టైల్‌లో సెటైర్ సంధించారు.

బెయిల్ మంజూర‌వ‌డంతో చంద్ర‌బాబు న్యాయ‌వాదులు త‌దుప‌రి ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి 7 గంట‌ల మధ్య చంద్ర‌బాబు జైలు నుండి విడుద‌ల అవ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

Updated On 31 Oct 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story