Chandrababu's quash petition : చంద్రబాబుకు దక్కని ఊరట.. క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
చంద్రబాబుకు(Chandrababu) హైకోర్టులో(High court) ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై(Quash Petition) విచారణ ఈ నెల 19కి వాయిదావేసింది హైకోర్టు. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు(CID Court) ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా(Siddharth Luthra) వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు(Chandrababu) హైకోర్టులో(High court) ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై(Quash Petition) విచారణ ఈ నెల 19కి వాయిదావేసింది హైకోర్టు. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు(CID Court) ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా(Siddharth Luthra) వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఏసీబీ కోర్టులో ఉన్న సీఐడీ కస్టడీ పిటీషన్‌పై విచారణను ఈ నెల 18 వరకూ నిలిపివేయాలని హైకోర్టు పేర్కొంది.