Journalist Guidelines For Site Allotment : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. గైడ్‌లైన్స్ ఇవే!
ఏపీలో(Andhra Pradesh) జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు(House Site) కేటాయించాలని కేబినెట్(Cabinet) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై జీవో(GO) కూడా రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో ఇళ్ల స్థలాల కేటాయింపుపై గైడ్‌లైన్స్(Guidelines) చేర్చింది.
ఏపీలో(Andhra Pradesh) జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు(House Site) కేటాయించాలని కేబినెట్(Cabinet) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై జీవో(GO) కూడా రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో ఇళ్ల స్థలాల కేటాయింపుపై గైడ్‌లైన్స్(Guidelines) చేర్చింది. ఇళ్ల స్థలాలు ఏఏ జర్నలిస్టులకు ఎలా ఇస్తారో ఈ జీవోలో మెన్షన్ చేసింది. అవే ఇంటో చూద్దాం..!
జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు(Online Registration) చేసుకోవాలి. ఇందుకుగాను ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. 45 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జిల్లాల ఇంచార్జి మంత్రులు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు
1. జర్నలిస్టుకు ఐదేళ్ల అక్రిడేషన్(accredation) మస్ట్. కనీసం ఐదేళ్లు అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు పొందేందుకు అర్హులవుతారు
2. జర్నలిస్ట్‌కు లేదా జీవిత భాగస్వామికి గతంలో ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి ఉంటే ఈ పథకంలో ఇంటి స్థలం పొందేందుకు అనర్హుడు.
3. జర్నలిస్ట్ లేదా జీవిత భాగస్వామికి పనిచేస్తున్న లేదా నివసించే స్థలంలో ఇంటి స్థలం లేదా ప్లాట్ లేదా ఇల్లు ఈ పథకానికి అనర్హులౌతారు
4. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలుు, కార్పొరేషన్‌లలో గుర్తింపు పొందిన ఉద్యోగులకు జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ ప్రకారం ఇంటి స్థలం దక్కదు
5. జర్నలిస్ట్ తాను పనిచేస్తున్న లేదా నివసిస్తున్న ఏరియాలో ఇంటి స్థలం కేటాయించవచ్చు. పనిచేసే లేదా నివసించే మండలంలో కేటాయించే అవకాశం ఉంది.
6. ఒక్కో జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం కేటాయిస్తారు. ఈ స్థలం ధరను 60 శాతం ప్రభుత్వం భరిస్తే, 40 శాతం జర్నలిస్టు భరించాలి.
7. కేటాయించిన స్థలంలో సొంతంగా తనే ఇల్లును నిర్మించుకోవాలి. పదేళ్లలోగా ఇంటి నిర్మాణం చేయకపోతే కేటాయింపు రద్దవుతుంది.