ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే

ఆంధ్రప్రదేశ్ లో విద్య పరంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించనుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భా­గంగా ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఎడె­క్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లె­ర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు పొందొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులను, రెగ్యులర్‌ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. విద్యార్థికి నచ్చిన వర్టికల్స్‌ చదువుకునేలా ప్రణాళిక రూపొందించారు. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్‌ కోర్సు­లకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్‌ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఆ క్రెడిట్స్‌ మ­న కరిక్యులమ్‌లో భాగమవుతాయి. దీంతో ఏపీ విద్యార్థులు గ్లోబల్‌ స్టూడెంట్స్‌గా ఎదిగే అవకాశం ఉంది.

Updated On 15 Feb 2024 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story