తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర్‌(Chandrasekhar) అనే జనసేన కార్యకర్తకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Govt) అండగా నిలిచింది. చంద్రశేఖర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని అతడి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ప్రత్యేక కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ హరికృష్ణ(Dr Hari Krishna) ట్వీట్‌ చేశారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర్‌(Chandrasekhar) అనే జనసేన కార్యకర్తకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Govt) అండగా నిలిచింది. చంద్రశేఖర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని అతడి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ప్రత్యేక కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ హరికృష్ణ(Dr Hari Krishna) ట్వీట్‌ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో చంద్రశేఖర్‌ అనార్యోగానికి గురయ్యాడు. స్ట్రోక్‌ రావడంతో అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వివిధ రకాల పరీక్షలు చేసిన డాక్టర్లు అతడికి ఆటో ఇమ్యూన్‌ ఎన్‌సెఫాలిటిస్‌ ప్యానెల్(Autoimmune Encephalitis Panel) చేయాలని చెప్పారు. స్ట్రోక్‌ వచ్చినప్పటి నుంచి చంద్రశేఖర్‌ కోలుకోలేకపోయాడు. పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అభిమాని అయిన చంద్రశేఖర్‌ జనసేన పార్టీ కార్యకర్త కూడా! అతడి చికిత్స కోసం కుటుంబసభ్యులు అప్పులు చేయాల్సి వచ్చింది. వారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే! దీంతో చంద్రశేఖర్‌ చికిత్సకు అవసరమైన ఫండ్స్‌ కోసం పవన్‌కల్యాణ్‌ అభిమాని ఒకరు మార్చి 22వ తేదీన ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. చంద్రశేఖర్‌కు జరిగిన వైద్య పరీక్షల వివరాలను, ఇప్పటి వరకు జరిగిన చికిత్స వివరాలను జత చేస్తూ అతడికి ఆర్ధిక సాయం అందించాలని నెటిజన్లను కోరారు. బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఫోన్‌ నెంబర్లను కూడా జత చేశాడు. జనసైనికులు చేసిన విన్నపానికి ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేయించారు. 'చంద్రశేఖర్‌కు గత ఏడాది అక్టోబర్‌లో పక్షవాతం(Paralysis) వచ్చింది. ప్రస్తుతం వైజాగ్ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నాం. అతనికి కావాల్సిన వైద్య సౌకర్యాలన్నీ సమకూర్చాలని కేజీహెచ్ సూపరిటెండెంట్‌తో మాట్లాడాము. చంద్రశేఖర్‌కు అవసరమైనవన్నీ అందుతాయి. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా తెలియజేశాం. అతని చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ కింద చెల్లిస్తాం' అంటూ హరికృష్ణ ట్వీట్ చేశారు.

https://x.com/HariKrishnaCMO/status/1771783723543142511?s=20

Updated On 25 March 2024 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story