ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నారా..

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నారా.. ఆర్టీసీకి సంబంధించిన 2 వేల ఎకరాల ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయా.. ఆర్టీసీ ఇక పూర్తిగా ప్రైవైట్ వ్యక్తుల ఆస్తిగా మారబోతుందా.. రాష్ట్ర ప్రభుత్వం అటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి సంబంధించి కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు గుజరాత్‌ వెళ్లి అక్కడి బస్‌స్టేషన్లను స్టడీ చేసి వచ్చాయని వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని వడోదరలో ప్రైవేట్‌ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే బస్‌స్టేషన్‌ను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ ఆస్తులను ఇచ్చేందుకు కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం కూడా ఆ దిశగా ఆదేశాలు ఇస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీకి సంబంధించిన 2 వేల ఎకరాలు, 129 బస్‌డిపోలు, 400 బస్‌స్టేషన్లు ప్రేవేట్‌ వ్యక్తులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ భూములను 15 ఏళ్లకో, 20 ఏళ్లకో, 30 ఏళ్లకో నామినల్‌ ఫీజుతో ప్రైవేట్‌ వ్యక్తుల ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తే అక్కడ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇప్పుడు అక్కడ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ ఆదాయం ఆర్టీసీకి వస్తోంది. కానీ ప్రైవేట్‌ వ్యక్తుల ఇస్తే ఆ ఆదాయం ప్రైవేట్‌ వ్యక్తులకు వెళ్లబోతుంది. ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం వల్ల వచ్చే లాభనష్టాలపై నియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story