ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు గవర్నర్. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారని.. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయం అని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని […]

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు గవర్నర్. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారని.. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయం అని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నారని, మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మారిపోయాయన్నారు. విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నారన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశారని, వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం అమలు చేయడంతో పాటుగా ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తారన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నారన్నారు గవర్నర్. అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చన్నారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నారన్నారు. అలాగే 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నారని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశారని.. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశారని, విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందన్నారు. 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి.. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించారని, ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించారన్నారు.

Updated On 5 Feb 2024 12:17 AM GMT
Yagnik

Yagnik

Next Story