AP Governor Abdul Nazeer : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Naseer) దర్శించుకున్నారు. ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.

AP Governor Abdul Nazeer
తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) దర్శించుకున్నారు. ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy), ఈవో ధర్మారెడ్డి, అర్చక బృందం "ఇస్తికఫాల్" ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం. విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
