విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులు. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల విధి. విద్యను(Education), వైద్యాన్ని అమ్ముకోకూడదు. ప్రభుత్వాలు ఈ రెండింటిని ప్రజలకు ఉచితంగా అందించాలి. ముఖ్యంగా విద్యారంగంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహర్‌రెడ్డి(YS Jagan) ఎప్పుడూ ముందుంటారు. విద్యారంగంలో జగన్ చేపట్టిన సంస్కరణలు చూసి ప్రధాని(Prime minister) అడ్వైజరీ కౌన్సిల్‌ అబ్బురపడింది.

విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులు. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల విధి. విద్యను(Education), వైద్యాన్ని అమ్ముకోకూడదు. ప్రభుత్వాలు ఈ రెండింటిని ప్రజలకు ఉచితంగా అందించాలి. ముఖ్యంగా విద్యారంగంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహర్‌రెడ్డి(YS Jagan) ఎప్పుడూ ముందుంటారు. విద్యారంగంలో జగన్ చేపట్టిన సంస్కరణలు చూసి ప్రధాని(Prime minister) అడ్వైజరీ కౌన్సిల్‌ అబ్బురపడింది. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్‌ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టారు. విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లీషు మీడియంను(English medium) తీసుకొచ్చారు. స్కూల్‌ డ్రాప్‌ అవుట్స్‌ ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ఈ రంగంలో అగ్రగామిగా నిలిచింది. ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా లేటెస్ట్ నివేదిక ఇదే చెబుతోంది. కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ విడుదల చేసిన నివేదకలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిందని తేలింది. ఫౌండేషన్‌ కోర్సుల్లో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ(Kerala) ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ కన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాలలో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి అని చెప్పారు. ఈ విషయంలో రాజస్థాన్‌ 25.67, గుజరాత్‌ 22.28, బీహార్‌ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి.పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

Updated On 8 Jan 2024 9:27 AM GMT
Ehatv

Ehatv

Next Story