AP Weather Forecast : ఆంధ్రప్రదేశ్‌పై పడగ విప్పనున్న మిచాంగ్
బంగాళాఖాతంలో(Bay Of Bengal) ఏర్పడనున్న తుఫాన్(cyclone) ఆంధ్రపదేశ్‌ను(Andhra Pradesh) వణికిస్తోంది. తుఫాన్ ప్రభావం కోస్తాంధ్ర(andhra Cost), రాయలసీమలో(Rayalaseema) భయంకరంగా ఉండబోతున్నది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.

AP Weather Forecast
బంగాళాఖాతంలో(Bay Of Bengal) ఏర్పడనున్న తుఫాన్(cyclone) ఆంధ్రపదేశ్‌ను(Andhra Pradesh) వణికిస్తోంది. తుఫాన్ ప్రభావం కోస్తాంధ్ర(andhra Cost), రాయలసీమలో(Rayalaseema) భయంకరంగా ఉండబోతున్నది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను(Collectors) ఆదేశించింది. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలలో కంట్రోల్ రూమ్‌లు(Control room) ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో(Thadepally) రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్(SDRF) బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రికి నెల్లూరుకు ఆగ్నేయంగా 790 కిలోమీటర్ల దూరంలో , బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860 కిలోమీటర్ల దూరంలో , మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుఫాన్‌గా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అటు పిమ్మట ఉత్తర దిశగా కదులుతూ 5వ తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీరాన్ని దాటే సమయంలో మాత్రం గాలి వేగం 80 నుంచి 90 కిలోమీటర్ల ఉంటుందని, గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన ‘మిచాంగ్’ పేరు పెట్టారు.
