చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు గత ప్రభుత్వం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్‌ కార్పొరేషన్‌ ఆయనకు నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్‌ లేకపోయినా ఫైబర్‌నెట్‌ నుంచి కోటీ 15 లక్షల రూపాయల వరకు మేలు చేకూర్చుకున్నారని రామ్‌గోపాల్‌వర్మకు లీగల్‌ నోటీస్‌ జారీచేశారు. ఈ మేరకు ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ జి.వి.రెడ్డి(Gv Reddy) ఆదేశాల మేరకు నాటి ఫైబర్‌నెట్‌ ఎండీ సహా ఐదుగురికి నోటీసులు పంపారు. 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈసినిమాకు కేవలం 1863 వ్యూసే ఉన్నాయని.. ఒక్కో వ్యూస్‌కు 11 వేల రూపాయల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని.. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రాంగోపాల్ వర్మతో జి.వి.రెడ్డి ఒప్పందం చేసుకున్నట్లు కాకుండా రూల్స్‌ను అధిగమించి డబ్బు చెల్లించారని నోటీసులో తెలిపారు.

ehatv

ehatv

Next Story