✕
New Registration Policy : ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు..
By ehatvPublished on 27 March 2025 12:30 PM GMT
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం.

x
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. ఇకపై ఆఫీస్ బయట పడిగాపులు అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందుస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది. మొన్నటి వరకు భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వెయిటింగ్ చేయకుండా రిజిస్ట్రేషన్ సమయానికి వెళ్తే సరిపోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. గత కొంత కాలంగా తెలంగాణలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్న విషయం తెలిసిందే.

ehatv
Next Story