Ap Government : ఏపీలో మందుబాబులకు తీపి కబురు.. ఇక నుంచి..!
ఏపీలో కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. బ్రాండెడ్ మద్యం అమ్మకాలను తిరిగి మార్కెట్ లో మొదలయ్యాయి. రూ 99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, కొత్త బార్ల పాలసీ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజా గా తీసుకున్న నిర్ణయం మందుబాబులకు కిక్ ఇవ్వనుంది.
ఏపి పోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ(Excise Department ) 3 స్టార్ మరియు అంతకంటే ఎక్కువ హోటల్స్ లో బార్లు ఏర్పాటుకు నాన్ - రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు(non-refundable registration charges ) తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇది గత ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు ప్రకారం లైసెన్స్ ఫీజు 5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు 50 లక్షలు (1 సం. రానికి) ఉంది. అయితే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయని.. ఇది టూరిజంపై ప్రభావం చూపుతుందని, ఛార్జీలు సవరణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఏపీ (Ap)హోటల్స్ అసోసియేషన్ కూడా పక్క రాష్ట్రాల్లో అమలులో ఉన్న చార్జీలు ప్రకారం తగ్గింపు నివ్వాలని కోరిన మేరకు.. లైసెన్స్ ఫీజు 5 లక్షలు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20 లక్షలకు (1 సం.రానికి) తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంతో పోలిస్తే సగానికి పైగా చార్జీలు తగ్గించింది. టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగం అభివృద్ధి కొరకు ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
