AP Govt : మద్యం షాపుల గడువు పెంచిన ఏపీ సర్కార్
ఏపీ సర్కార్ మద్యం షాపుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ సర్కార్(AP Govt) మద్యం షాపుల(Liquor Shops) గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. షాపుల కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ(Extend) ఉత్తర్వులు విడుదల చేసింది. మద్యం షాపుల గడువును ఏడాది పొడిగిస్తున్నట్లు అబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ(Rajath Bhargava) జీవో ఎంఎస్ నెంబరు 466ని జారీ చేశారు. 2,934 షాపులను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్(YS Jagan) దశలవారీగా మద్యపాన నిషేధం(Prohibition of alcohol) హామీ ఇచ్చారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదనే విమర్శలు గున్నాయి. తాజాగా 2,934 షాపులనూ కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ప్రజలు, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..!