Sankranti Holidays : సంక్రాంతి సెలవులు పొడిగించిన సర్కార్..!
సంక్రాంతి సెలవుల(Sankranti Holidays)ను జనవరి 20 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం(AP Govt) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది

AP government extends Sankranti holidays till Jan. 20 Current Affairs
సంక్రాంతి సెలవుల(Sankranti Holidays)ను జనవరి 20 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం(AP Govt) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 20వ తేదీ శనివారం వరకూ అదనంగా మరో రెండు రోజులు సెలవులు పొడిగించాలని తల్లిదండ్రులు(Parents), ఉపాధ్యాయుల(Teachers) నుంచి వినతులు వచ్చాయని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్(S Suresh Kumar) ఉత్తర్వుల్లో తెలియజేశారు.
మొదట్లో జనవరి 9 నుంచి జనవరి 18 వరకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఇప్పుడు సెలవులను జనవరి 20 వరకు పొడిగించారు. జనవరి 21 ఆదివారం కావడంతో ఆరోజు కూడా పాఠశాలలు తెరచుకోవు. దీంతో జనవరి 22న స్కూళ్లు తిరిగి(Schools Reopen) ప్రారంభమవుతాయి.
