వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శాసనసభ వ్యవహారాల బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శాసనసభ వ్యవహారాల బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర అసెంబ్లీకి హాజరు కావాలని కోరారు.

ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజల సంక్షేమం కోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని మంత్రి కేశవ్ అన్నారు. “ప్రధాన అధికార పార్టీ అయినప్పటికీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది. పారదర్శక పాలన అందించడానికి, జవాబుదారీతనం ఉండేలా కృషి చేస్తాం’’ అని చెప్పారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ముందుగా పరిస్థితిని సమీక్షించుకోవాలని అన్నారు. "వేగవంతమైన అభివృద్ధిని సులభతరం చేయడానికి రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడంపై మేము దృఢంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతోపాటు అన్ని రంగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తారని చెప్పారు. తొలిరోజు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. అన్ని రకాల అప్పులు, రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారుల‌ను కోరారు.

Eha Tv

Eha Tv

Next Story