AP EX CM Jagan :నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయాడు..! ఆర్గనైజ్డ్ క్రైంలో చంద్రబాబు దిట్ట
ఇంతకాలం బడ్జెట్ ఎందుకు పెట్టలేదని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.
ఇంతకాలం బడ్జెట్ ఎందుకు పెట్టలేదని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. మోసాలు, అబద్దాలు బయటపడతాయనే బడ్జెట్ పెట్టలేదన్నారు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 4 నెలలే ఉందని.. సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తారనే బడ్జెట్ పెట్టలేద్నారు జగన్. బడ్జెట్ చూస్తే ఆర్గనైజ్డ్ క్రైంలా ఉందని..ఎల్లో మీడియా ద్వారా పదే పదే అబద్దాలు రాపిస్తారని.. అదే విషయాన్ని చంద్రబాబు పదేపదే చెప్తారన్నారు. తనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే చెప్తారని..దాన్నొక అంతర్జాతీయ సమస్యగా మారుస్తారన్నారు. ఏ ప్రభుత్వమైనా అప్పులు తీసుకోవడం సాధారణమేనని
ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలకు లోబడే అప్పులు చేస్తారన్నారు జగన్. చంద్రబాబు, జగన్ మొహాలను చూసి అప్పులు ఇవ్వరు, రాష్ట్ర ఎకానమీ చూసి అప్పులు ఇస్తారన్నారు. ఆర్గనైజ్డ్ క్రైం అని ఎందుకున్నానంటే ఒక పద్దతి ప్రకారం.. రాష్ట్ర అప్పులపై తన ఎల్లో మీడియాలో రాపిస్తారని.. ఆ తర్వాత ఆయన దత్త పుత్రుడు అంటారని.. బీజేపీలో ఉన్న టీడీపీ నాయకురాలు కూడా ఇదే విధంగా అప్పులపై తప్పుడు ప్రకటనలు చేపిస్తారని జగన్ వ్యంగాస్త్రాలు విసిరారు.
అప్పులు 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అని తప్పుడు ప్రకటనలు తన ఎల్లో మీడియాలో, తన నాయకుల చేత చెప్పిస్తారన్నారు జగన్. ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్‌లు ఎగ్గొట్టాలని ఈ అప్పులు ఆ అప్పులు అంటూ పబ్బం గడుపుకుంటారని జగన్ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జగన్ మీద నెపం పెట్టాలని చూస్తారన్నారు. ఒరిజినల్ బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులపై నిజం చేప్పాల్సి వస్తుందని ఇన్నాళ్లు గడిపారని జగన్ విమర్శించారు. తీరా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 2018-19 నాటికి 2.57 లక్షల కోట్లు అప్పు ఉందని ప్రకటించారు. దీనికి కార్పొరేషన్ల అప్పు 55 వేల కోట్లు అదనం. చంద్రబాబు దిగిపోయేనాటికి 3.13 లక్షల కోట్లు మాకు అప్పజెప్పారు. మా ప్రభుత్వం దిగిపోయేనాటికి ప్రభుత్వ అప్పులు 6.46 లక్షల ఉంది. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 12 లక్షల కోట్లు, ఎక్కడ 10 లక్షల కోట్లు.. చివరికి 6.46 లక్షల కోట్లు అని తేల్చారు.