ఆంధ్రప్రదేశ్‌లో ఎలెక్షన్‌ కమిషన్‌(AP Election commission) అభాసుపాలవుతోంది. నవ్వులపాలవుతోంది. ఎన్నికలను ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా నిర్వహించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ముఖ్యంగా పల్నాడు(Palnadu) ప్రాంతంలో! పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్‌(Faction) గొడవలు, బాంబుల దాడులు, ఇంకేదో విన్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం. వాటిని చూస్తుంటే ఎన్నికల సంఘం నిద్రపోతున్నదనే విషయం అర్థమవుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఎన్నికలను అద్భుతంగా నిర్వహించామని తమకు తామే కితాబిచ్చుకుంది ఎన్నికల సంఘం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎలెక్షన్‌ కమిషన్‌(AP Election commission) అభాసుపాలవుతోంది. నవ్వులపాలవుతోంది. ఎన్నికలను ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా నిర్వహించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ముఖ్యంగా పల్నాడు(Palnadu) ప్రాంతంలో! పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్‌(Faction) గొడవలు, బాంబుల దాడులు, ఇంకేదో విన్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం. వాటిని చూస్తుంటే ఎన్నికల సంఘం నిద్రపోతున్నదనే విషయం అర్థమవుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఎన్నికలను అద్భుతంగా నిర్వహించామని తమకు తామే కితాబిచ్చుకుంది ఎన్నికల సంఘం. చెదురు ముదురు ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా జరిగాయని తెలిపింది. అలాంటి ఎన్నికల సంఘం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆయన మీద చర్యలు తీసుకుంటామని, కేసు పెడతామని చెప్పింది. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? నిజానికి ఆ వీడియో ఉంటే గింటే ఎన్నికల సంఘం దగ్గర ఉండాలి. తెలుగుదేశంపార్టీ(TDP) దగ్గరకు ఎలా వెళ్లింది? అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చింది? బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం బయటకు వచ్చి ఎందుకు రియాక్టవుతోంది? ఇప్పుడు మరో వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌ స్టేషన్‌ లోపలకి వెళ్లి ఈవీఎంలు(EVM) ధ్వంసం చేస్తున్న దృశ్యాలు క్లియర్‌గా ఉన్నాయి. ఈ వీడియో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YCP) చెందిన సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు దీనిపై ఎన్నికల సంఘం ఏమంటుంది? ఈ వీడియో కూడా ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదని, వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని చెబుతుందా? ఈ అన్ని వీడియోలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. మరి అది ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నదా? ఎందుకు రెస్పాండ్‌ అవ్వలేదు? ఆ స్థాయిలో బూత్‌లు ఆక్రమణలు చేసి, ఈవీఎంలు పగలగొడుతుంటే ఏం మాట్లాడకుండా? ఏం చేస్తున్నది ఎన్నికల సంఘం? మిగతా బూత్‌ల దగ్గర ఈవీఎంలు పగిలిన దగ్గర ఏం చర్యలు తీసుకున్నారు? వాటిని ఎవరు పగలగొట్టారు? వారి మీద ఎలాంటి కేసులు పెట్టారు? వాళ్లలో ఎవరిని అరెస్ట్‌ చేశారు? ఇదంతా ఒక విషయమైతే, పిన్నెల్లి ఘటనపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చెబుతున్నదేమిటంటే..ప్రశాంతంగా పోలింగ్‌(Polling) జరుగుతుంటే ఎవరూ వెళ్లి ఈవీఎంలను బద్దలు కొట్టరు. అక్కడేదో జరిగి ఉంటుంది. అక్కడ తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారనే కబురు పిన్నెల్లికి వచ్చింది. కచ్చితమైన సమాచారం ఉంది కాబట్టే ఈవీఎంను పగులకొట్టారు. ఇందుకు కూడా ఎన్నికల సంఘం చిత్రమైన సమాధానం చెబుతోంది. ఈవీఎంలు పగిలిపోయినంత మాత్రానా ఏమీ కాదని, తమ దగ్గర పూర్తి డాటా ఉందని ఎన్నికల సంఘం అంటోంది. అసలు ఆ ఈవీఎంలు పగలగొట్టడానికే కారణం రిగ్గింగ్‌ జరిగినట్టే కదా! సమస్యనే రిగ్గింగ్ కదా! ఈవీఎం పగులగొట్టిన చోట వీవీ ప్యాడ్స్‌ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూడొచ్చు. ఓట్ల లెక్కింపు అప్పడు ఏదైనా అనుమానం వస్తే వీవీ ప్యాడ్స్‌ లెక్కిస్తారు కదా! మరి ఇవి లేకుండా ఎలా? అసలు ఎన్నికల సంఘం ఏం చేయబోతున్నది? ఇప్పుడు చూద్దాం.

Updated On 23 May 2024 7:58 AM GMT
Ehatv

Ehatv

Next Story