ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 3349 పరీక్షా కేంద్రాల్లో 6.65 లక్షలకు విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది. పరీక్షలు రాసిన వారిలో బాలురు 3,11,329 కాగా.. బాలికలు 2,97,741 మంది ఉన్నారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 72 .2 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు... వారిలో బాలురు 69.27 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 75.38 ఉతీర్ణత సాధించారు.. ఇక జిల్లాలవారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలువగా.. నంద్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఉతీర్ణత శాతం పెరిగిందని మంత్రి బొత్స తెలిపారు. విదార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్‏లో చూసుకోవచ్చు bse.ap.gov.in

Updated On 6 May 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story