AP EAMCET 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. లింక్ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET) 2024 కోసం నమోదు ప్రక్రియను మార్చి 12న ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. cets.apsche.ap.gov.in లింక్ ఓపెన్ చేసుకోండి.
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. అభ్యర్థులు తమ దరఖాస్తును మే 5 వరకు ఆలస్య రుసుముతో సమర్పించవచ్చు. AP EAPCET 2024 హాల్ టికెట్ మే 7న విడుదల చేయనున్నారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్‌తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్‌తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్‌తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
