ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మూడు రాజ్యసభ స్థానాలకు(Rajya sabha) ఖాళీలు ఏర్పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మూడు రాజ్యసభ స్థానాలకు(Rajya sabha) ఖాళీలు ఏర్పడ్డాయి. మూడు స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్(Polling day) జరిగి అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి(Mohidevi), బీద మస్తాన్‌రావు(Bidha mastan rao), ఆర్.కృష్ణయ్య(R krishnaiah) రాజీనామాతో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే టీడీపీ(TDP) నుంచి ఇద్దరికి, జనసేన(Janasena) ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) సోదరుడు నాగబాబుకు(Nagababu) అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు(Ashok gajapathi raju), గల్లా జయ్‌దేవ్‌కు(Galla Jaidev) రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశముందని సమాచారం. పవన్ కల్యాణ్ ఢిల్లీలో ప్రధాని మోడీతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.