ఖాళీగా ఉన్న మంత్రి పదవిని జనసేనకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఖాళీగా ఉన్న మంత్రి పదవిని జనసేనకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. నాగబాబు(Naga Babu) గారికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ వ్యూహంలో భాగంగానే నాగబాబుకు ఈ పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. నాగబాబును రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకొని తాను కేంద్రమంత్రిగా వెళ్లాలనుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో జాతీయ అంశాలపై పదేపదే మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందువుల పరిస్థితిపై తన వాదనను వినిపిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడడంతో ఆయనకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఉండే కంటే ఢిల్లీ(Delhi)లో ఉంటేనే బాగుంటుందని సమాచారం. ఎన్నికల సమయంలో టిక్కెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ(BJP) పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు వచ్చిన జాతీయస్థాయి ఇమేజ్‌తో తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్న ఎన్డీఏ బాగస్వామి పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.

ehatv

ehatv

Next Story