Pawan Kalyan Gives Strong Counter To Perni Nani : ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?
రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం..ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?
రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం..ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు తిట్టలేదా..అని నిలదీశారు. మంగళగిరిలో పవన్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వైసీపీ నేత పేర్ని నాని చేసిన తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయి. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా? గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తోంది. అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, పనిచేసే సంస్కృతిని చంపేశారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలన బేరీజు వేసుకోండి. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేయాలని చెబుతున్నాం. పాలన తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఇప్పటివరకు దృష్టి పెట్టాం. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఎన్డీఏ ఆధ్వర్యంలో చాలా బాధ్యతతో పనిచేస్తున్నాం. పదవులు అనుభవించడం కాదు.. బాధ్యతతో పనిచేస్తాం. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల. తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామ ని పవన్ కల్యాణ్ చెప్పారు.