Pawan Kalyan : లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది పవన్ కల్యాణ్?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) కు ఆవేశం తప్ప ఆలోచన లేదనే విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) కు ఆవేశం తప్ప ఆలోచన లేదనే విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువు అయ్యింది. ఈ మాట పవన్ కల్యాణ్ అభిమానులకు బాధ కలిగిస్తుండవచ్చు కానీ ఇదే వాస్తవం. పొంతన ఉండని ఆయన మాటలే అందుకు నిదర్శనం. నేనే గనక హోం మంత్రిని అయితే పరిస్థితి ఇలా ఉండదని అంటూ పాపం అనితను(anitha vangalapudi) ఆడిపోసుకున్నారు. అంటే అనిత సరిగ్గా పనిచేయడం లేదనేగా అర్థం. అయినా లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును(chandrababu) వదిలేసి
హోమంత్రిగా అనిత ఫెయిల్ అయ్యారని వార్నింగ్ ఇవ్వడేమిటో ఎవరికి అంతుపట్టడం లేదు. శాంతి భదత్రల వైఫల్యం లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కు కూడా బాధ్యత ఉంటుంది కదా! మహిళల మీద 80 అఘాయిత్యాలు, అత్యాచారాలు
జరిగేదాకా ఏమి చేస్తున్నట్టు పవన్? నిజంగానే శాంతి భద్రతలు అదుపుతప్పాయనే అనుకుందాం! చంద్రబాబు క్లోజ్ ఫ్రెండే కదా.. ఆయనను అడిగితే హోం డిపార్ట్మెంట్ సంతోషంగా అప్పగిస్తారు కదా!
అయినా తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలపలేదని సాక్షత్తూ టీటీడీ EO చెప్పినా కూడా విజయవాడ దుర్గమ్మ మెట్లు క్రిందనుంచి పైకి కడిగారు కదా, తిరుపతి లో Unapologetic సనాతన్
అని ఊగిపోతూ రెచ్చిపోయావు కదా! కానీ ఏనాడైనా. ఈ అఘాయిత్యాలు గురించి మాట్లాడవా పవన్ జీ! కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు లో మహిళల మిస్సింగ్ లపై క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా అదే విషయాన్ని ఎందుకు చెబుతున్నట్టు? ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా జగన్ మీద నెట్టేయడం ఏమిటి? యోగి ప్రభుత్వం లా అరెస్టు లు చేయాలని సెలవిచ్చారు మీరు. అంటే చంద్రబాబు ఫెయిల్ అయినట్టేనా పవన్? అసలు ఏమి చెప్పదల్చుకున్నారో మీకు అయినా క్లారిటీ ఉందా? మొన్నే చెప్పుకున్నాం పవన్ మారరు అని. నిన్నటి ప్రసంగం తో అది రూఢి అయ్యింది.