ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. అందుకే గురువారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశానికి కూడా హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ఈ మధ్యన ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. దీక్ష విరమణ కోసం ఆయన తిరుమలకు మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మెట్లు ఎక్కడానికి పవన్‌ చాలా ఇబ్బంది పడ్డారు. అసలు నడవడానికే అవస్థ పడ్డారు. అనేక సార్లు విశ్రాంతి తీసుకున్నారు. అతి కష్టం మీద ఎలాగో అలాగ తిరుమలకు చేరుకున్నారు. తర్వాత ఆయన తీవ్రమైన జ్వరం, దగ్గు, వెన్నునొప్పితో బాధపడ్డారు. తిరుమలలోనే చికిత్స తీసుకుంటూ విశ్రాంతిలో ఉన్నారు. తిరుపతిలో సనాతన డిక్లరేషన్‌కు కూడా పవన్‌ ఇబ్బంది పడ్డారు. కాకపోతే ముందే ప్రకటించిన షెడ్యూల్ కాబట్టి తప్పసరిగా పాల్గొనాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన అంత యాక్టివ్‌గా లేరు. ఇదిలా ఉంటే పవన్‌ అనారోగ్యంపై జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని ప్రార్థిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story