ఎన్నికల వేళ ఏమైనా అనొచ్చు. ఎంతైనా అనుకొవొచ్చు.

ఎన్నికల వేళ ఏమైనా అనొచ్చు. ఎంతైనా అనుకొవొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంయమనం అవసరం. ఇష్టానికి మాట్లాడితే జనం హర్షించరు. అదేమిటో కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న వారి నోటికి హద్దు అదుపు ఉండటం లేదు. తెలంగాణలో అయితే శబ్ద కాలుష్యం కంపు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా! డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్(Pawan kalayn) ఇంకా తాను ఎన్నికల ప్రచారం లో ఉన్నానని అనుకుంటున్నారు. తొక్కి నార తీస్తా.. కాళ్ళు విరగ్గొడతా..అంటూ రెచ్చిపోతున్నారు. నిన్నటికి నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్(YSR Congress) నాయకులను ఘాటు పదాలతో తిట్టారు.11 సీట్లకు పడిపోయినా వారి నోళ్ళు మాత్రం మూతపడలేదని పవన్ చెబుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల నోళ్ళ నుంచి ఏమి రాకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా ఆత్మస్తుతి కూడా చేసుకున్నారు. తాను చాలా త్రికరణ శుద్ధిగా పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. మళ్ళీ పాత పద్ధతిలో కుటుంబ సభ్యలను తిడితే ఊరుకునేది లేదన్నారు. లక్ష్మి నరింహస్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా, మిమ్మల్ని చూసుకునే బాధ్యత తనదే అని చెప్పారు పవన్. వైసీపీ నేతల నోళ్ళు ఎక్కువైనాయని అన్నారు

రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేస్తే కాళ్ళు విరగొట్టి కింద కూర్చోపెడతా అని హెచ్చరించారు. ఇవన్నీ విన్న తర్వాత పవన్ ఇక జన్మలో మారరు అని రూఢి అయ్యింది.

Eha Tv

Eha Tv

Next Story