ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ సీఎల్పీ నేత‌ మల్లు భట్టివిక్రమార్క ఆంధ్రరత్న భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌పై విమర్శలు గుప్పించారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(APCC Leader Gidugu Rudraraju) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ అంటే బాబు(Chandrababu), జగన్(Jagan), పవన్(Pawan Kalyan) అని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ సీఎల్పీ నేత‌ మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆంధ్రరత్న భవన్(Andhraratna Bhavan) లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(Vishaka Steel Factory) ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను మొదలు పెట్టినా.. ఏపీలో అధికారంలో ఉన్న జగన్, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యతిరేకించడం లేదని విమర్శించారు. టీడీపీ(TDP), వైసీపీ(YSRCP), జనసేన(Janasena)లు బీజేపీ(BJP)కి బీ టీమ్ పార్టీ(B Team)లని దుయ్యబట్టారు. ఈ మూడు పార్టీలు బీజేపీకి దాసోహం అయ్యాయని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపేస్తామని తెలిపారు.

ఇదిలావుంటే.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ష‌ర్మిల(Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరబోతోందనే సమాచారం తనకు ఉందని కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandrarao) కూడా చెప్పడం గమనార్హం. ఒక‌వేళ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. పీసీసీ అధ్యక్షుడు(PCC Leader) గిడుగు రుద్రరాజు త‌న ప‌ద‌విని త్యాగం చేయాల్సివుంటుంది.

Updated On 4 July 2023 1:05 AM GMT
Yagnik

Yagnik

Next Story