Raghu Veera Reddy back to Politics : మళ్లీ రాజకీయాల్లోకి రఘువీరారెడ్డి.. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం.!
నీలకంఠాపురం రఘువీరారెడ్డి(Raghu Veera Reddy). రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి చిరపరితమీ పేరు! కొన్నాళ్లుగా రాజకీయాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్న ఈయన ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రఘువీరారెడ్డి కీలక భూమిని పోషించబోతున్నారు. బెంగళూరు సిటీ పరిశీలకుడిగా రఘువీరాను నియమించింది ఏఐసీసీ. తన గ్రామంలో దేవాలయాల నిర్మాణ పనుల కారణంగా నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ
నీలకంఠాపురం రఘువీరారెడ్డి(Raghu Veera Reddy). రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి చిరపరితమీ పేరు! కొన్నాళ్లుగా రాజకీయాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్న ఈయన ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రఘువీరారెడ్డి కీలక భూమిని పోషించబోతున్నారు. బెంగళూరు సిటీ పరిశీలకుడిగా రఘువీరాను నియమించింది ఏఐసీసీ. తన గ్రామంలో దేవాలయాల నిర్మాణ పనుల కారణంగా నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న రఘువీరారెడ్డి ఇన్నాళ్లకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పని చేసిన రఘువీరా రోశయ్య మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రఘువీరాకు అదే శాఖను అప్పగించారు.
అంతకు ముందు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పని చేశారు. 1985లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తగా ఈయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. 1989లో అనంతపురం జిల్లా మడకశిర నుంచి పోటీ చేసి గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడే కోట్ల క్యాబినెట్‌లో చోటు సంపాదించుకున్నారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో సుమారు ఆరువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తర్వాత 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. 2009లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పెనుగొండ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కొంతకాలం పని చేసిన రఘువీరా ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రఘువీరా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రజల కోరిక మేరకు, ప్రజల కొరకు
ప్రజాక్షేత్రంలోకి తిరిగి అడుగుపెడుతున్న
రాజకీయ దురంధరుడు
నీలకంఠాపురం @drnraghuveera గారికి ఘణ స్వాగతం!!#BossIsBack pic.twitter.com/JMJcpWd8et— Ambati Ramakrishna Yadav (@RamakrishnaINC) April 18, 2023