YS Sharmila : ఆశ్చర్యం... చంద్రబాబు, పవన్‌లను షర్మిల నిలదీశారు..!
కాంగ్రెస్ నాయకురాలు వై.ఎస్.షర్మిల(YS sharmila) మరో ట్వీట్(Tweet) చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు వై.ఎస్.షర్మిల(YS sharmila) మరో ట్వీట్(Tweet) చేశారు. మహాశ్చర్యమేమిటంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను(Pawan kalyan) ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. ఈసారి ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్‌రెడ్డిని(YS Jagan) వదిలేశారు. ఆమె ట్వీట్ ఎందుకు చేశారంటే ఆరోగ్యశ్రీపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అనుమానం వచ్చి! ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఇప్పుడైనా ఏపీని పాలిస్తున్న కూటమిని ఏమీ అనుకుంటే తనను అనుమానిస్తారన్న ఉద్దేశంతో షర్మిల ట్విట్టర్ వేదికగా పెమ్మసాని వ్యాఖ్యలపై చంద్రబాబు, పవన్‌లు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పెమ్మసాని వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలని అనుకుంటున్నారేమోననే అనుమానం కలుగుతుందని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం? అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే అయిదు లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా? గత వైసీపీ ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు షర్మిల. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.