వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) కాంగ్రెస్‌లోనే(congress) ఉన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీలో(TDP) చేరారా?

వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) కాంగ్రెస్‌లోనే(congress) ఉన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీలో(TDP) చేరారా? రెండు మూడు రోజుల నుంచి ఆమె మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎవరికైనా ఈ సందేహం కలుగుతుంది. తెలుగుదేశంపార్టీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబు(Chandrababu) నాయుడును కానీ ఎవరైనా ఏమైనా అంటే షర్మిలకు బుస్సున కోపం వచ్చేస్తున్నది. టీడీపీ క్యాడర్‌కు కూడా అంత కోపం రావడం లేదు. దాంతో పాటు తడవ తడవకోసారి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై(YS jagan) విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏమైనా అంటే షర్మిలకే కోపం వస్తున్నదా? లేకపోతే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవారందరికీ వస్తున్నదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమిలో బీజేపీ కీలక భాగస్వామి. మరి బీజేపీ(BJP) అంటే కాంగ్రెస్‌కు అసలు పడదు. షర్మిల మాత్రం బీజేపీ మిత్రపక్షాలకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, లా అండ్‌ ఆర్డర్‌ లేనేలేదని జగన్‌ పదే పదే ఆరోపిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలు పది మందికి తెలియడం కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్నారు. మంగళవారం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ జగన్‌పై విరుచుకుపడిన షర్మిల బుధవారం వరద ప్రాంతాలను సందర్శించిన అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ మళ్లీ జగన్‌నే ఆడిపోసుకున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే గీస్తే ప్రత్యేక హోదా కోసం చేయాలట! పోలవరం కోసం చేయాలట! ఈ సలహాలు ఇస్తూనే జగన్‌ను గట్టిగా విమర్శించారు. ఆ విధంగా చంద్రబాబును పరోక్షంగా వెనకేసుకు వచ్చారు. దీనివల్ల ఆమెకు వచ్చే ప్రయోజనమేమిటో ఎవరికీ తెలియడం లేదు. చంద్రబాబుకు దగ్గరగా ఉంటేనే తన పీసీసీ అధ్యక్ష పదవి నిలుస్తుందని షర్మిల భావిస్తున్నారేమో! ఢిల్లీకి వెళ్లారా? పదకొండు మందే కదా ఉన్నారు.. వంటి మాటలు ఆమె మాట్లాడటం సరి కాదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఆమె మాత్రం ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదూ! జగన్‌తో ఇంటి గొడవలు ఉంటే ఉండవచ్చు. అది పబ్లిక్‌ చేయకూడదు. రాజకీయానికి వాడుకోకూడదు. ఇది షర్మిలకు తెలుసో తెలియదో!

Eha Tv

Eha Tv

Next Story