విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ(vizag steel factory privatization) లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ(vizag steel factory privatization) లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అని ఏపీ కాంగ్రెస్‌(AP congress) చీఫ్‌ వై.ఎస్‌.షర్మిల(YS sharmila) ప్రశ్నించారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా ఉంది కేంద్రం తీరు ఉందని విమర్శించారు.. ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ఇక ముడిపదార్థాలు నిండుకున్నాయని, కొనేందుకు చిల్లిగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమే అంటూ యాజమాన్యం చేతులెత్తేస్తుంటే ప్రధాని మోదీకి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. లేదు లేదు అంటూనే ఆయన దోస్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కుక్కను చంపాలి అంటే పిచ్చి దానిగా చిత్రీకరించినట్లు విశాఖ స్టీల్ కు రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారని, నిధులు ఇవ్వకుండా సైలెంట్ గా నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే అదానీ,అంబానీ,జిందాల్ లాంటి వాళ్లకు కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ నేతలు, కూటమిలో భాగస్వామ్యం అయిన టీడీపీ, జనసేన పార్టీలు దీనిపై వెంటనే స్పందించాలని, తక్షణమే విశాఖ ఉక్కుకు ఆర్ధిక సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్ కు పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని షర్మిల చెప్పుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story