CM Jagan : రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం.. అక్కడి నుంచి కడపకు..
సీఎం జగన్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు.. ఖరీప్–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు. అనంతరం సీఎం జగన్ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.

CM Jagan
సీఎం జగన్(CM Jagan) రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు.. ఖరీప్–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు. అనంతరం సీఎం జగన్ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
8వ తేదీ ఉదయం సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చేరుకుంటారు.
అనంతరం ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సభావేదిక వద్దకు చేరుకుని.. డాక్టర్ వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఖరీఫ్ –2022లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం వైయస్సార్ జిల్లా ఇడుపులపాయకు వెళ్తారు.
