ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఈ నెల 13న విజయవాడలో

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఈ నెల 13న విజయవాడలో రాయితో దాడి చేసిన కేసులో నిందితుడ్ని విజయవాడ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు పేర్కొన్న పుట్టినతేదీ వివరాలకు, అతడి ఆధార్ కార్డులో ఉన్న తేదీకి తేడా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి ఆధార్ కార్డులోని పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని.. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు. పోలీసులు ఐపీసీ 307 సెక్షన్ తో హత్యాయత్నం కేసు నమోదు చేశారని, 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని అన్నారు. నిందితుడు దురుద్దేశపూర్వకంగానే రాయితో దాడి చేశాడని పోలీసుల తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని కోర్టుకు తెలిపారు.

Updated On 18 April 2024 8:42 AM GMT
Yagnik

Yagnik

Next Story