ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు కొనసాగనుంది

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు కొనసాగనుంది. సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన నంబూరు బైపాస్‌ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. మంగళగిరి బైపాస్‌ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్‌ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్‌ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్‌సింగ్‌ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్‌ మీదుగా వెళ్లనున్నారు. కేసరపల్లి బైపాస్‌ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపొందారు. ఈసారి పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.

Updated On 12 April 2024 9:51 PM GMT
Yagnik

Yagnik

Next Story