YS Jagan Master Sketch : జగన్ మాస్టర్ స్కెచ్ .. అద్దంకి బరిలో బలరాం..!
ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ఎంతో కీలకమైనది. ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం కుటుంబసభ్యులే గత 30 ఏళ్లుగా అధికారం చూస్తూ వస్తున్నారు.. అయితే ఎవరూ అద్దంకిని అభివృద్ధి చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కరణం బలరాం పోటీ చేస్తే వైసీపీ నుంచి గొట్టిపాటి రవి కుమార్ పోటీ చేసారు.. ఈ ఎన్నికల్లో కరణంపై గొట్టిపాటి విజయం సాధించారు.. ఆ తరువాత అనేక రాజకీయ పరిస్థుతుల వల్ల గొట్టిపాటి టీడీపీలో చేరారు.
ప్రకాశం జిల్లా(Prakasam District).. పేరుకు పెద్ద జిల్లా అయినా అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది. ఈ జిల్లా నుంచి ఎంతో మంది చైతన్య పరిచే రాజకీయనేతలు వచ్చినా.. జిల్లా అబివృద్ధిలో మాత్రం ఎవరూ వారి ప్రత్యేక ముద్రను వేయలేక పోయారు. ఇప్పటికీ ఈ జిల్లాలో చాలా చోట్ల కనీస తాగునీరు లేని గ్రామాలూ ఎన్నో ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ఎంతో కీలకమైనది. ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం కుటుంబసభ్యులే గత 30 ఏళ్లుగా అధికారం చూస్తూ వస్తున్నారు.. అయితే ఎవరూ అద్దంకిని అభివృద్ధి చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి కరణం బలరాం పోటీ చేస్తే వైసీపీ నుంచి గొట్టిపాటి రవి కుమార్ పోటీ చేసారు.. ఈ ఎన్నికల్లో కరణంపై గొట్టిపాటి విజయం సాధించారు.. ఆ తరువాత అనేక రాజకీయ పరిస్థుతుల వల్ల గొట్టిపాటి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కరణం, గొట్టిపాటి రవి ఒకే పార్టీలో ఉండటంతో టీడీపీలో వర్గపోరు మొదలైంది. దీనికి చెక్ పెడుతూ చంద్రబాబు కరణంను చీరాల నియోజకవరగానికి మార్చారు.
టీడీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ప్రకాశం ఒకటి.. 2019 ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకొని దాదాపు 5 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించి. ఇందులో కరణం బలరాం పోటీ చేసిన చీరాల కూడా ఉంది. అయితే బలరాం ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇక తాను రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండనని ప్రకటించారు అందుకోసమే.. అయన వారసుడు వెంకటేష్ ను రంగంలోకి దింపారు.. వెంకటేష్ ప్రస్తుతం చీరాల వైసీపీ సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు.. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా వెంకటేష్ పోటీ చేస్తారని కార్యకర్తలు చెబుతున్నారు.
గొట్టిపాటి రవి వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన నేత. రవిని ఓడించాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ జగన్ కు అది కుదరడం లేదు. ప్రస్తుతం అద్దంకి వైసీపీ సమన్వయకర్తగా బాచిన కృష్ణ చైతన్య ఉన్నారు.. ఈయన తండ్రి గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. 2019 ఎన్నికల్లో కృష్ణ చైతన్య గొట్టిపాటి చేతిలో ఓటమి చవి చూసారు.
రవిని ఓడించాలంటే జగన్ కు సరైన బలం, బలగం ఉన్న నేత కావాలి.. దానికి కరణం బలరాం అయితే సరిపోతాడని పార్టీ నేతలు భావిస్తున్నారట.. అందుకోసమే రాబోయే ఎన్నికల్లో అద్దంకి వైసీపీ అభ్యర్థిగా కరణంను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.. కానీ దానికి కరణం అంగీకరించడంలేదట. తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని అందుకే వెంకటేష్ ను రాజకీయాల్లో ఉంచానని అయన తెలిపారు. కానీ జగన్ మాత్రం కరణం మాటను పట్టించుకోవడం లేదు.. ఎలాగైనా బలరాంను అద్దంకి నుంచి పోటీ చేయించి గొట్టిపాటి రవిని ఓడించి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యారట.. మరి జగన్ మాటను.. కరణం వింటారా.. ఆయన అద్దంకి నుంచి పోటీ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.